కరోనా విజృంభణ.. 1305 భవనాలకు రాకపోకలు నిలిపివేత

తాజా వార్తలు

Published : 20/02/2021 23:50 IST

కరోనా విజృంభణ.. 1305 భవనాలకు రాకపోకలు నిలిపివేత

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర రాజధాని ముంబయిలో 2749  కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు. దీంతో కొవిడ్‌-19 విజృంభణ దృష్ట్యా బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) ముంబయిలోని 1305 భవనాలకు రాకపోకలు నిలిపివేసినట్లు శనివారం ప్రకటించింది. కాగా, 71,838 కుటుంబాలు ఈ భవనాల్లో నివసిస్తున్నాయని బీఎంసీ  తెలిపింది. డిసెంబర్‌ నుంచి చూసుకుంటే.. శుక్రవారం, శనివారం ముంబయిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో మొత్తంగా 3,17,310 కేసులు నమోదవగా, 11,435 మంది మరణించినట్లు అధికారులు గణాంకాలు వెల్లడించారు. 
రోజూ సుమారు 15 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి సిటీలో 700 లకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 440 మంది డిశ్ఛార్జి కాగా,  మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,98,435కి చేరింది. ప్రస్తుతం 6,577 క్రియాశీల కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని