ఆ ఐలాండ్‌లో కరోనా బాధితులకే ఎంట్రీ! 

తాజా వార్తలు

Updated : 01/09/2020 15:17 IST

ఆ ఐలాండ్‌లో కరోనా బాధితులకే ఎంట్రీ! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీంతో అన్ని దేశాలూ లాక్‌డౌన్‌ విధించి.. విదేశీయుల రాకపోకలను నిలిపివేశాయి. ఇప్పటికీ ఈ వైరస్‌ నిర్మూలనకు సరైన మందు అందుబాటులోకి రాలేదు. దీంతో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నా.. తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ కార్యకలాపాలన్నీ ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభమవుతున్నాయి. అయితే మనం ఎక్కడికైనా వెళ్తే కరోనా పరీక్షల్లో ఫలితం నెగిటివ్‌ వస్తేనే అనుమతి ఇస్తున్నారు. కానీ బ్రెజిల్‌లోని ఓ ఐలాండ్‌లో మాత్రం కేవలం కరోనా పాజిటివ్‌ ఉన్నవారినే సందర్శనకు అనుమతిస్తామంటోంది.

పెర్నోంబుకో స్టేట్‌లోని ఫెర్నాండో డె నొరొహా అనే ఐలాండ్‌ల సమూహం ఉంది. ఇందులో 21 ఐలాండ్స్‌ ఉన్నాయి. కరోనా ప్రబలక ముందు ఈ ఐలాండ్‌కు లక్షల సంఖ్యలో పర్యటకులు వచ్చేవారు. బ్రెజిల్‌లోనే అత్యధిక పర్యటకులు సందర్శించే ప్రాంతంగా దీనికి పేరుంది. ఓ సంస్థ నుంచి ఈ ఐలాండ్‌ ‘వరల్డ్స్‌ బెస్ట్‌ బీచ్‌’గా ట్రావెలర్స్‌ చాయిస్ అవార్డు కూడా అందుకుంది. అలాంటి ఐలాండ్‌ కరోనా కారణంగా మార్చిలో మూతపడింది. అయితే ఈ సందర్శక ప్రాంతాన్ని వచ్చే వారం నుంచి తిరిగి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని, అది కూడా కేవలం కరోనా పాజిటివ్‌ పర్యటకులకు మాత్రమే అనుమతిస్తామని స్థానిక అధికారులు వెల్లడించారు.

‘‘ఈ ఐలాండ్స్‌లోకి రావాలంటే ముందుగా పర్యాటకులు తమకు కరోనా పాజిటివ్‌ అని తెలిపే నివేదిక సమర్పించాలి. పీసీఆర్‌ టెస్టుతో వచ్చిన ఫలితాన్నే పరిగణలోనికి తీసుకుంటాం. పర్యటనకు వచ్చే కనీసం 20రోజులోపే కరోనా పాజిటివ్‌ వచ్చి ఉండాలి. లేదా సెరాలాజికల్‌ టెస్ట్‌ ఫలితాన్ని సమర్పించొచ్చు. ఇక్కడికి రావాలనుకునే వాళ్లు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు’’అని అధికారులు వెల్లడించారట. అయితే కేవలం కరోనా బాధితులనే ఎందుకు ఆహ్వానిస్తున్నారనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కానీ విచిత్రంగా ఉంది కదా.. ఈ ఐలాండ్‌ ముచ్చట!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని