ఎవరెస్ట్‌ ఎక్కిన తర్వాత.. వాటిని వదిలేయొద్దు

తాజా వార్తలు

Published : 11/05/2021 01:10 IST

ఎవరెస్ట్‌ ఎక్కిన తర్వాత.. వాటిని వదిలేయొద్దు

సాహసయాత్రికులను కోరిన నేపాల్‌ అధికారులు

ఖాట్మండు : పొరుగు దేశం నేపాల్‌లోనూ కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కూడా ఆక్సిజన్‌ కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సమకూర్చడంపై అక్కడి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించే వారు తమ వెంట తీసుకెళ్లే ఆక్సిజన్‌ ట్యాంక్‌లను అక్కడే వదిలేసి రాకుండా వాటిని వెంటపెట్టుకుని తీసుకురావాలని కోరింది.

ఎవరెస్ట్‌ సాహసయాత్రకు వెళ్లే వారు వీటిని అక్కడే వదిలి వేయక తమ వెంట తీసుకురావాలని నేపాల్‌ మౌంటెనీరింగ్‌ అసోసియేషన్‌(ఎన్‌ఎంఏ) అధికారులు కోరారు. ‘ఈ సీజన్‌లో క్లైంబర్స్‌, వారి సహాయకులు దాదాపు 3500 ఆక్సిజన్‌ బాటిళ్లను తీసుకువెళ్లి ఉంటారని అంచనా. సాహస యాత్ర పూర్తికాగానే సాధారణంగా వీటిని పర్వతాల్లోనే వదిలేస్తుంటారు. అయితే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో అవి కరోనా బాధితులకు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే మేం సాహసయాత్రికులకు  ఈ విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఎన్‌ఎంఏ సీనియర్‌ అధికారి కాల్‌బహదూర్‌ తెలిపారు.

ఆదివారం నేపాల్‌లో దాదాపు 9 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గత నెలలో నమోదైన రోజువారీ కేసుల కంటే ఈ సంఖ్య 30 రెట్ల అధికం. నేపాల్‌లో ఇప్పటి వరకూ 3.9 లక్షల కేసులు నమోదు కాగా..3,720 మరణాలు చోటుచేసుకున్నాయి. కేసుల సంఖ్య పెరగడంతో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఎక్కువ మందిని చేర్చుకోలేకపోతున్నామని ఖాట్మండులోని ప్రైవేట్‌ ఆస్పత్రులు పేర్కొంటున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని