Gadchiroli Encounter: కమాండోలకు ఘనస్వాగతం
close

తాజా వార్తలు

Published : 23/05/2021 01:31 IST

Gadchiroli Encounter: కమాండోలకు ఘనస్వాగతం

గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలీలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న సీ-60 కమెండోలకు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఘన స్వాగతం లభించింది. బ్యాండు వాయిద్యాలతో వారికి భద్రతా దళాలు స్వాగతం పలికాయి. కమాండోలపై పూలు, స్ప్రే చల్లి ఆహ్వానం పలికాయి. ఉన్నతాధికారులు చప్పట్లు కొడుతూ.. వారిని అభినందించారు. 

గడ్చిరోలీ జిల్లా పైడి అటవీప్రాంతలో శుక్రవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 13 మంది నక్సల్స్‌ హతమయ్యారు. కాసన్సూర్‌ దళానికి చెందిన మావోయిస్టులు పొగాకు ఒప్పందం గురించి సమీప గ్రామ ప్రజలతో మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీ-60 కమాండో బృందం అక్కడ మాటు వేసింది.

శుక్రవారం ఉదయం గ్రామ ప్రజలను కలిసేందుకు నక్సల్స్‌ రాగా.. అప్పటికే అక్కడకు చేరుకున్న కమాండోలు వారిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతాసిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు మావోయిస్టులు అడవిలోకి  పారిపోయారని డీఐజీ సందీప్  పాటిల్ తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని