కెనడా చట్ట సభలో నగ్నంగా..

తాజా వార్తలు

Updated : 16/04/2021 14:20 IST

కెనడా చట్ట సభలో నగ్నంగా..

 జూమ్‌ మీటింగ్‌లో ఘటన

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా జూమ్‌ యాప్‌ వినియోగం పెరగడంతోపాటు.. చాలా మంది వ్యక్తిగత జీవితాలు ఆన్‌లైన్‌కెక్కుతున్నాయి.  కొవిడ్‌ కారణంగా కెనడా పార్లమెంట్‌ సమావేశాలు జూమ్‌ విధానంలో జరుగుతున్నాయి. ఇటీవల హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభ భేటీలో ఓ సభ్యుడు నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత నాలుక్కరుచుకొని క్షమాపణలు చెప్పాడు.

కెనడాలోని క్యూబెక్‌ ప్రావిన్స్‌కు చెందిన విలియమ్‌ అమోస్‌ అనే లిబరల్‌ పార్టీ ఎంపీ ఆ దేశ కామన్స్‌ సభ జూమ్‌ మీటింగ్‌లో దిగంబరంగా కనిపించారు. ఆ సమయంలో సభలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతోంది. వాస్తవానికి ఆయన ఏమీ మాట్లాడలేదు. కెనడా, క్యూబెక్‌ జాతీయ పతాకాల మధ్య నిలబడి దుస్తులు మార్చుకొంటూ కనిపించాడు. తన తప్పును గ్రహించిన విలియమ్‌ ఆ తర్వాత వివరణతో కూడిన క్షమాపణలను తెలియజేశారు.

‘‘నేను ఈ రోజు దురదృష్టవశాత్తు తప్పు చేశాను. దానికి సిగ్గుపడుతున్నాను. నేను జాగింగ్‌కు వెళ్లొచ్చిన తర్వాత  ఆఫీస్‌ దుస్తులు ధరిస్తుండగా.. పొరబాటున కెమెరా ఆన్‌ అయింది. సభలోని నా సహచరులకు నేను క్షమాపణలు తెలియజేయడంతోపాటు.. మరో సారి ఇటువంటి పొరబాటు జరగకుండా చూసుకొంటాను’’ అని ఆయన బుధవారం రాత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీకి చెందిన క్లాడే డిబెల్లెఫ్యయెల్లే అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మనం ఒక వ్యక్తి శరీరాన్ని చూశాం. కానీ, మన సభ్యులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని వారి కెమెరాల విషయంలో అప్రమత్తంగా ఉంటారని భావిస్తున్నాను.  సభలో పురుష సభ్యులు టై, జాకెట్‌ ధరించడం తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని