Viral: కారును మింగేసిన రోడ్డు!

తాజా వార్తలు

Updated : 19/07/2021 20:28 IST

Viral: కారును మింగేసిన రోడ్డు!

దిల్లీ: ఇటీవల ముంబయిలో భారీ వర్షాలతో చిన్న నీటిగుంత ఓ కారును లోపలికి లాక్కున్న ఘటన గుర్తుందా? అదే తరహా ఘటన సోమవారం దిల్లీలో చోటుచేసుకుంది. ఓ కారు రోడ్డులోకి పూర్తిగా దిగబడిపోయింది. దేశ రాజధాని నగరంలో భారీ వర్షాలతో రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. ఈ క్రమంలో ద్వారకాలోని సెక్టార్‌- 18లో రోడ్డు గుంతలా మారడంతో కారు లోపలికి జారిపోయింది. క్రేన్‌ సాయంతో దీన్ని బయటకు తీసుకొచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్కడికి చేరుకున్న స్థానికులు ఫొటోలు తీశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో దిల్లీలో రోడ్ల నాణ్యతపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అలాగే, పుల్‌ ప్రహ్లాద్‌ పుర్‌ ప్రాంతంలో 27 ఏళ్ల యువకుడు వరద నీటిని చిత్రీకరిస్తుండగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.  నగరంలో సోమవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. టిక్రీ రోడ్డు వద్ద భారీగా వరదనీరు చేరడంతో చెరువులను తలపించింది. లామ్‌పూర్‌ అండర్‌పాస్‌ వద్ద కూడా భారీగా వరదనీరు చేరింది. నరెలాలోని రామ్‌దేవ్‌ చౌక్‌ వద్ద భారీగా వరదనీరు చేరడంతో అటువైపుగా ప్రజలు రావొద్దంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని