కాక్‌పిట్‌లో పిల్లి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..!

తాజా వార్తలు

Published : 05/03/2021 01:35 IST

కాక్‌పిట్‌లో పిల్లి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాక్‌పిట్‌లోకి వచ్చిన పిల్లి పైలట్‌పై దాడి చేయడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టార్కో ఏవియేషన్‌కు చెందిన విమానం సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌ నుంచి ఖతార్‌ బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో పిల్లి ఆకస్మికంగా ప్రత్యక్షమై పైలెట్‌పై దాడిచేసింది. దీంతో పైలట్‌ అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. అయితే ఆ పిల్లి విమానంలోకి ఎలా వచ్చిందో అన్న దానిపై  స్పష్టత లేదు. విమానాశ్రయంలో రాత్రి సమయంలో ఆ పిల్లి అక్కడికి వచ్చి ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు. రాత్రి విమానాన్ని శుభ్రం చేసే సమయంలో ఆ పిల్లి అక్కడే నక్కి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ ఘటనపై టార్కో ఏవియేషన్‌ ఇప్పటివరకు స్పందించలేదు. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం తొలిసారేం కాదు. గతంలో ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో విమానాన్ని గంటల తరబడి నిలిపివేసిన ఘటనలు ఉన్నాయని సిబ్బంది పేర్కొంటున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని