వాట్సాప్‌.. ఆ పాలసీ వెనక్కి తీసుకో: కేంద్రం 

తాజా వార్తలు

Published : 19/01/2021 21:08 IST

వాట్సాప్‌.. ఆ పాలసీ వెనక్కి తీసుకో: కేంద్రం 

దిల్లీ: వాట్సాప్‌ ప్రైవసీ పాలసీలో ఇటీవల చేసిన మార్పులను ఉపసంహరించుకోవాలని ఆ సంస్థను కేంద్రం ఆదేశించింది. ఏకపక్షంగా చేసిన ఈ మార్పులు ఆమోదయోగ్యమైనవి కాదని తెలిపింది. ఈ మేరకు వాట్సాప్‌ సీఈవోకు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ మంత్రిత్వశాఖ మంగళవారం ఘాటు లేఖ రాసింది. వాట్సాప్‌కు ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగదారులు భారత్‌లో ఉన్నారని గుర్తుచేసింది. అలాగే,  ఆ సంస్థ సర్వీసులకు అతి పెద్ద మార్కెట్‌ స్థావరంగా భారత్‌ ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ ప్రతిపాదించిన ప్రైవసీ పాలసీలో దేశ పౌరుల్లో వ్యక్తిగత గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నట్టు తెలిపింది. సమాచార గోప్యత, ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ, డేటా సెక్యూరిటీకి సంబంధించి రూపొందించిన విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరింది.

కొద్ది రోజుల క్రితం వాట్సాప్‌ కొత్త టర్మ్స్‌ అండ్‌ ప్రైవసీ పాలసీ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యూజర్స్‌ వాట్సాప్‌ ఓపెన్‌ చేసిన వెంటనే అందుకు సంబంధించిన విధివిధానాలతో కూడిన జాబితాను చూపిస్తూ ఒక పాప్-అప్‌ విండో ప్రత్యక్షమైంది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పాలసీపై యూజర్స్‌ అంగీకరించాలన్నది దాని సారాంశం. ఇందులో భాగంగా యూజర్స్ వ్యక్తిగత సమాచారంతోపాటు ఐపీ అడ్రస్‌ వంటి వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకుంటారంటూ కొత్త గోప్యతా విధానంపై భారత్‌ సహా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాట్సప్‌ వెనక్కి తగ్గింది. ఫిబ్రవరి 8 నుంచి అమలు చేయాలనుకున్న గోప్యతా విధానాన్ని మే 15కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

కొత్త గోప్యతా విధానంపై వెనక్కి తగ్గిన వాట్సప్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని