CA Exams: సీఏ పరీక్షల వాయిదా కుదరదు

తాజా వార్తలు

Published : 29/06/2021 21:31 IST

CA Exams: సీఏ పరీక్షల వాయిదా కుదరదు

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌(సీఏ) పరీక్షలు జులై 5 నుంచే జరుగుతాయని, వీటిని వాయిదా వేసేందుకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఏ పరీక్షలు మే నెలలో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఐసీఏఐ(ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా) వాయిదా వేసింది. జులై 5 నుంచి 20 మధ్య జరపాలని నిర్ణయించింది. అయితే వీటిని రద్దు చేయాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. 

ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింనందున పరీక్షల నిర్వహణకు ఇదే అనుకూల సమయమని ఐసీఏఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. వచ్చే సోమవారం నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. అయితే కొవిడ్‌ ప్రభావిత విద్యార్థులకు మరో అవకాశం కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఐసీఏఐకి సూచించింది. అంతేగాక, పరీక్ష కేంద్రాల నిర్వహణపై రేపటి లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని