ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌: ఐదుగురు జవాన్ల మృతి 
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 17:39 IST

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌: ఐదుగురు జవాన్ల మృతి 

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరగింది. నక్సల్స్‌కు, జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మావోయిస్టులు కూడా హతమైనట్లు సమాచారం. 

సుక్మా, బిజాపూర్ సరిహద్దు వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతాసిబ్బంది శనివారం నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో నక్సల్స్‌ కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు ఛత్తీస్‌గఢ్‌ డీజీ డీఎం అవస్తీ తెలిపారు. అయితే జవాన్లవైపు ప్రాణనష్టం ఎక్కుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇద్దరు నక్సల్స్‌ కూడా మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. 

మార్చి 23న నారాయణపూర్‌ జిల్లాలో భద్రతాసిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని నక్సల్స్‌ పేల్చివేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని