Bagram air base: బగ్రామ్‌ ఎయిర్‌బేస్‌పై చైనా కన్ను..!

తాజా వార్తలు

Updated : 02/09/2021 16:25 IST

Bagram air base: బగ్రామ్‌ ఎయిర్‌బేస్‌పై చైనా కన్ను..!

నిక్కీహేలీ అనుమానం

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా..  అఫ్గానిస్థాన్‌ను వీడటంతో ఇప్పుడు చైనా ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చూస్తోందని వాదనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ కూడా ఇటువంటి అనుమానమే వ్యక్తం చేశారు. ఆమె ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైనా భవిష్యత్తులో బగ్రామ్‌ వైమానిక స్థావరంలో తిష్ఠ వేసే అవకాశం ఉందన్నారు. చైనాను ఓ కంట కనిపెట్టాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు తాము పోరాట పటిమ చూపకపోవడంతో భవిష్యత్తులో రష్యా వంటి వారు మరిన్ని ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందన్నారు. ‘‘వారు అఫ్గానిస్థాన్‌లోకి ప్రవేశించి పాక్‌ సాయంతో బలపడవచ్చు. ఆ తర్వాత భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయవచ్చు’’ అని నిక్కీ పేర్కొన్నారు. 

అమెరికా సైబర్‌ నేరాలను ఎదుర్కొనేలా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని నిక్కీ సూచించారు. మిత్ర దేశాలతో కలిసి పనిచేయాలన్నారు. ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌తో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. అమెరికా వారి వెనుక ఉందని ఆ దేశాలకు భరోసా ఇవ్వాలని బైడెన్‌కు సూచించారు.   

తాలిబన్లకు చైనా మద్దతు..

తాలిబన్లను మంచి చేసుకొనే చైనా అప్పుడే పని ప్రారంభించింది. అఫ్గానిస్థాన్‌ను ఒక వీరోచిత దేశంగా అభివర్ణించింది. ఆ దేశం ఎప్పుడూ విదేశీ శక్తులకు తలొగ్గలేదని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. రెండు దశాబ్దాల పాటు జరిగిన యుద్ధంలో అఫ్గాన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై దర్యాప్తు జరపాలని కోరింది. అమెరికా వాయుసేన దాడుల్లో అధికారిక లెక్కల కంటే చాలా ఎక్కువ మందే ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అమెరికా ప్రణాళికా రహితంగా బలగాలను ఉపసంహరించుకొందని విమర్శించింది. తాలిబన్లతో స్నేహ, సహకార సంబంధాలు ఏర్పరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు డ్రాగన్‌ చెప్పింది. ఈ విషయాన్ని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ పేర్కొన్నారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని