China-afghanistan:‘పెద్దన్న పాత్ర’పై డ్రాగన్‌ దృష్టి

తాజా వార్తలు

Published : 05/09/2021 15:11 IST

China-afghanistan:‘పెద్దన్న పాత్ర’పై డ్రాగన్‌ దృష్టి

అఫ్గాన్‌లో చక్రం తిప్పేందుకు ఎత్తులు
మధ్య ఆసియాలో ఆధిపత్యం కోసం చైనా ఉవ్విళ్లు

న్యూయార్క్‌: అఫ్గాన్‌ నుంచి అమెరికా వెనక్కు మళ్లిన తర్వాత.. ఆ స్థానాన్ని అందిపుచ్చుకునేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఆ దేశానికి పెద్దన్నగా వ్యవహరించడం ద్వారా మధ్య ఆసియాలో ఆధిపత్యం చాటుకోవాలనుకుంటోంది. అంతర్జాతీయ విశ్లేషణ వెబ్‌సైట్‌ ‘ఇన్‌సైడ్‌ఓవర్‌’ దీనిపై ప్రత్యేక కథనం అందించింది. అఫ్గాన్‌ నుంచి అమెరికా తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడాన్ని చైనా తనకు ఒక మంచి అవకాశంగా భావిస్తోంది.

ఈ క్రమంలోనే అమెరికాపై పలుమార్లు విరుచుకుపడింది. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న ప్రారంభంలో... అమెరికా విమానం నుంచి ప్రజలు జారిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీనిపై డ్రాగన్‌ వెంటనే స్పందించింది. అఫ్గాన్‌ శరణార్థులను తరలించటంలో అమెరికా సరైన వ్యూహాన్ని అనుసరించలేదని విమర్శలు గుప్పించింది. తమ పొరుగుదేశం నుంచి అమెరికా వైదొలగడం పట్ల బీజింగ్‌ సంతోషంగా ఉందంటూ ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకుడు ఫెడెరికో గియులియాని ఈ కథనంలో పేర్కొన్నారు. ‘‘మధ్య ఆసియాలో ఆధిపత్యం కోసం బీజింగ్‌ సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తోంది. రష్యా, షాంఘై సెంట్రల్‌ ఆర్గనైజేషన్‌ల ద్వారా ప్రాంతీయంగా పట్టు సాధించాలని భావిస్తోంది. అఫ్గాన్‌లో అమెరికా బలగాలను మోహరించడం... ఓ విధంగా చైనా భద్రతకు, దాని ఆర్థిక వ్యవస్థ విస్తరణకు దోహదపడింది! అమెరికా తదితర దేశాలతో కలిసి అఫ్గాన్‌లో పనిచేసేందుకు బీజింగ్‌ ఏనాడూ ముందుకు రాలేదు. ఇప్పుడు మాత్రం డ్రాగన్‌ చూపు అఫ్గానిస్థాన్‌పై పడింది. అక్కడ తన ముద్ర వేయాలని భావిస్తోంది’’ అని ఫెడెరికో పేర్కొన్నారు. అమెరికా బలగాలు వెళ్లిపోయిన తర్వాత తాలిబన్‌ సేనలు కాబుల్‌ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఆ వెంటనే చైనా తాలిబన్లకు అనుకూలంగా ప్రకటన చేసింది. వారితో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నామని, ఇందుకు తాము సిద్ధమని వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని