ఒక్కరోజు హోంమంత్రిగా మహిళా కానిస్టేబుల్‌! 

తాజా వార్తలు

Published : 09/03/2021 02:11 IST

ఒక్కరోజు హోంమంత్రిగా మహిళా కానిస్టేబుల్‌! 

మధ్యప్రదేశ్‌లో మహిళకు అరుదైన గౌరవం

భోపాల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం లభించింది. మీనాక్షి వర్మ అనే కానిస్టేబుల్‌కు మధ్యప్రదేశ్‌లో ఒక్క రోజు హోంమంత్రిగా ఉండే గొప్ప ఛాన్స్‌ దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా ఆమెను ఒక్కరోజు హోంమంత్రిగా నియమించారు. ఆయనే స్వయంగా తన సీట్లో కూర్చోబెట్టి వినూత్నంగా గౌరవించారు. దీంతో ఆయన కార్యాలయంలో మీనాక్షి ఒక్కరోజు హోంమంత్రిగా విధులు నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను ఆమె తెలుసుకున్నారు. అయితే, ముఖ్యమంత్రికి ఓఎస్డీగా ఉన్న ఏడీజీపీ అశోక్‌ అవస్థీ అక్కడికి వచ్చి ఆమెను హోంమంత్రి సీట్లో చూసి షాక్‌ అయ్యారట. అనంతరం ఆమె ఒక్కరోజు హోంమంత్రిగా ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆమె చెప్పిన పనులు నిర్వర్తించారట. మరోవైపు, మీనాక్షి హోంమంత్రి నివాస కార్యాలయంలోనే సెక్యూరిటీ విధుల్లో ఉంటున్నారు.

మహిళలకు గౌరవం ఉన్నచోటే సంస్కృతి ఉద్ధరణ సాధ్యమవుతుందని హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. తన నివాస కార్యాలయంలో మీనాక్షి ఒక్కరోజు హోంమంత్రిగా విధులు నిర్వర్తించారని తెలిపారు. హోంమంత్రి కుర్చీలో కూర్చొని ప్రజల సమస్యలను వినడమే కాకుండా వాటిని పరిష్కరించేలా పలు సూచనలు ఇచ్చినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని