కరోనా వైరస్‌: దేశంలో 13,193 కొత్త  కేసులు

తాజా వార్తలు

Updated : 19/02/2021 12:35 IST

కరోనా వైరస్‌: దేశంలో 13,193 కొత్త  కేసులు

దిల్లీ: గడచిన 24 గంటల్లో 13,193 కొత్త కరోనా కేసులు నమోదుకావడంతో.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,09,63,394కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివరాల ప్రకారం ఈ ఉదయానికి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,39,542 కాగా, వ్యాధి పూర్తిగా నయమైన వారు 1,06,67,741 మంది అని తెలిసింది. ఈ శాఖ అందించిన వివరాల్లో కొవిడ్‌ రికవరీ రేటు 97.32 శాతంగా పేర్కొంది.

దేశవ్యాప్తంగా మరో 97మంది మరణించారు. దీంతో మొత్తం 1,56,111 మంది కరోనాకు బలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,01,88,007 మందికి కరోనా టీకాలు అందచేసినట్టు ఆ శాఖ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని