close

తాజా వార్తలు

Updated : 15/01/2021 11:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2.03 శాతానికి తగ్గిన క్రియాశీల కేసులు..

దిల్లీ: భారత్‌లో వైరస్‌ వ్యాప్తి కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ నిత్యం దాదాపు 15వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో  దేశవ్యాప్తంగా 7,30,096 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 15,590 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి 5 లక్షల 27వేలకు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1,01,62,738 మంది కోలుకోగా, నిన్న ఒక్కరోజే 15,975 మంది డిశ్ఛార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 191 కొవిడ్‌ మరణాలు నమోదుకావడంతో మొత్తం మృతుల సంఖ్య 1,51,918కి చేరింది. ప్రస్తుతం 2,13,027 క్రియాశీల కేసులు(2.03శాతం) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధం..
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి భారత్‌ సిద్ధమైంది. జనవరి 16న వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. తొలిరోజు దాదాపు 3లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా దాదాపు 3వేల టీకా పంపిణీ కేంద్రాలను సిద్ధం చేశారు. నిర్దేశించిన కేంద్రాలకు ఇప్పటికే వ్యాక్సిన్‌లను పంపిణీ చేసే పనిలో అన్ని రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి.

ఇక కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అలసత్వం వహించకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ దేశప్రజలకు సూచించింది. వ్యాక్సిన్‌ తీసుకున్నాక 14రోజుల తర్వాతే వాటి ప్రభావం ప్రారంభం అవుతుండడంతో అప్పటివరకు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

ఇవీ చదవండి..
10సెకన్లలోనే యాంటీబాడీ పరీక్ష
WHO అనుమతి కోసం వేచిచూస్తున్నాం..

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని