close

తాజా వార్తలు

Published : 18/01/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీకా పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డ్‌!

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా భారత్‌ రికార్డు స్థాయిలో టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా పంపిణీ ప్రారంభమైన తొలిరోజే  దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని తెలిపింది. ఇది అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో ఒకేరోజు వేసిన సంఖ్య కంటే ఎక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహన్ అగ్నాని వెల్లడించారు. తొలి రోజు రెండు లక్షల 7వేల మంది వ్యాక్సిన్‌ తీసుకోగా, రెండో రోజు 17 వేల మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఇప్పటి వరకు 2,24,301 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా తీసుకున్న వారిలో 447 మందికి దుష్ర్పభావాలు కనిపించాయని.. అవి కేవలం సాధారణమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటివి మాత్రమేనని స్పష్టంచేసింది. అయితే వీరిలో ముగ్గురికి మాత్రం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిచాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది. 

వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్యంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 553 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదనపు కార్యదర్శి మనోహర్‌ వెల్లడించారు. రెండో రోజు మొత్తం 17,072 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నాడు టీకా పంపిణీ కొనసాగిందని తెలిపారు. ఇక వ్యాక్సిన్‌ పంపిణీపై అన్ని రాష్ట్రాలతో సమీక్ష జరిపామని, తొలిరోజు ఎదురైన సమస్యలను గుర్తించామని చెప్పారు.

ఇవీ చదవండి..
భారత్‌లో టీకా పంపిణీ ప్రారంభం..
ట్విటర్‌ ట్రెండింగ్‌లో..



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని