వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు 500కేంద్రాలు: జైన్‌

తాజా వార్తలు

Published : 04/01/2021 20:10 IST

వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు 500కేంద్రాలు: జైన్‌

దిల్లీ: కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. దేశ రాజధానివ్యాప్తంగా తొలి దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం 500 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. టీకాలను 2-8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసేలా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. 

‘దేశీయంగా తయారైన రెండు కరోనా టీకాలకు డీసీజీఐ నుంచి అత్యవసర వినియోగ అనుమతి లభించడం స్వాగతించదగిన విషయం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం దిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 1000 వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ మొదటి దశలో భాగంగా 500 కేంద్రాలు సిద్ధం చేస్తున్నాం. టీకా అందిన తర్వాత దాని నిల్వ నుంచి పంపిణీ వరకు అన్ని సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే శనివారం మూడు ప్రాంతాల్లో డ్రైరన్‌ కార్యక్రమం కూడా నిర్వహించాం. కొద్ది రోజుల్లో టీకా చేతికి అందిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తాం’ అని జైన్‌ తెలిపారు.

‘సామాజిక దూరం పాటిస్తూ.. ప్రజలు కేంద్రాలకు బృందాలుగా వెళ్లేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. టీకా వేసే కేంద్రాలు ఎక్కువగా ఆస్పత్రులు లేదా.. ఆస్పత్రుల సౌకర్యాలు ఉన్న వాటిల్లోనే ఏర్పాటు చేస్తున్నాం. టీకా వేయించుకున్న తర్వాత ఎవరికైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏర్పడితే.. వెంటనే స్పందించడానికి పర్యవేక్షణా కూడా ఏర్పాటు చేశాం. దిల్లీలో కరోనా వైరస్‌ నియంత్రణలోనే ఉంది. కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ నేపథ్యంలో యూకే నుంచి వచ్చిన వారిపైనా నిఘా ఉంచాం’ అని సత్యేంద్రజైన్‌ పేర్కొన్నారు.

తొలి దశలో భాగంగా 3లక్షల మంది వైద్య సిబ్బంది, దాదాపు 6లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు టీకా అందించనున్నట్లు సమాచారం. కాగా ప్రజలందరికీ టీకా ఉచితంగా పంపిణీ చేస్తామని దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

గంగూలీకి యాంజియోప్లాస్టీ తర్వాత చేస్తాం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని