SC: అభ్యర్థుల నేర చరిత్రను పార్టీలు 48 గంటల్లో వెల్లడించాలి

తాజా వార్తలు

Published : 10/08/2021 12:53 IST

SC: అభ్యర్థుల నేర చరిత్రను పార్టీలు 48 గంటల్లో వెల్లడించాలి

స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

దిల్లీ: రాజకీయ వ్యవస్థను నేర రహితంగా మార్చే దిశగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజకీయ పార్టీలు ఎన్నికల నిమిత్తం తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారి నేరచరిత్రను బహిర్గతం చేయాలని మంగళవారం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరోధించేందుకు హైకోర్టుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించడం వీలుకాదని తెలియజేసింది. బిహార్ ఎన్నికలకు సంబంధించి గతంలోనూ ఈ తరహా తీర్పు ఇచ్చింది.

దానిలో భాగంగా.. ఎంపికైన అభ్యర్థులు 48 గంటల్లో తమ నేర చరిత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని లేకపోతే నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించిన తేదీకి కనీసం రెండు వారాల ముందు ఈ వివరాలను బయలు పర్చాలని ఆదేశించింది. తాజా తీర్పులో దాన్ని 48 గంటలకు పరిమితం చేసింది. పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్ని ఎందుకు ఎంచుకుంటున్నాయో కారణాల్ని వివరించాలని, కేసుల వివరాల్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని కోర్టు వెల్లడించింది.

తమ అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయని రాజకీయ పార్టీల గుర్తులను నిలిపివేయాలంటూ సుప్రీంలో పిటిషన్లు  దాఖలయ్యాయి అలాగే గతంలో ఇచ్చిన ఆదేశాలను పార్టీలు పాటించనందున అవి కోర్టును ధిక్కరించినట్లు భావించాలని పిటిషనర్లు కోరారు. మరోపక్క కోర్టు ఆదేశాల్ని పాటించనందుకు సీపీఐ(ఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా కోర్టుకు క్షమాపణలు తెలియజేశాయి. అలాగే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ పార్టీల గుర్తుల్ని నిలిపివేస్తామంటూ ఎన్నికల సంఘం కోర్టుకు వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని