స్వచ్ఛ పర్యాటక ప్రాంతాలు 12.. అవేంటో తెలుసా?

తాజా వార్తలు

Updated : 26/02/2021 18:17 IST

స్వచ్ఛ పర్యాటక ప్రాంతాలు 12.. అవేంటో తెలుసా?

స్వచ్ఛ పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసిన కేంద్రం

దిల్లీ: దేశంలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్రం స్వచ్ఛ పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద స్వచ్ఛ ఐకానిక్‌ ప్రాంతాలను గుర్తించాలన్న ప్రధాని సూచన మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 12 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేశారు. జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రసిద్ధ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫేజ్‌ 4 స్వచ్ఛ ఐకానిక్‌ ప్లేసెస్‌ కార్యక్రమంలో వీటిని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు స్వచ్ఛభారత్‌ మిషన్‌కు సబ్‌ మిషన్‌గా పనిచేస్తోంది.

ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాలు ఏవంటే..

1. సాంచి స్తూపం, మధ్యప్రదేశ్‌

2. గోల్కొండ కోట, తెలంగాణ

3. దాల్‌ సరస్సు, శ్రీనగర్‌

4. అజంతా గుహలు, మహారాష్ట్ర

5. ఆగ్రా కోట, ఉత్తరప్రదేశ్‌

6. కాళి ఘాట్‌ ఆలయం, పశ్చిమబెంగాల్‌

7. కుంభల్‌ కోట, రాజస్థాన్

8. జైసల్మేర్‌ కోట, రాజస్థాన్‌

9. రామ్‌దేవ్రా, రాజస్థాన్‌

10. రాక్‌ గార్డెన్‌, చండీగఢ్‌

11. బాంకే బిహారీ ఆలయం, మధుర, ఉత్తరప్రదేశ్‌

12. సూర్య దేవాలయం, కోణార్క్‌, ఒడిశా



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని