WHO: అది ప్రమాదకరం..!

తాజా వార్తలు

Updated : 13/07/2021 18:07 IST

WHO: అది ప్రమాదకరం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: వేర్వేరు తయారీదార్లు చేసిన వ్యాక్సిన్లను కాంబినేషన్‌ రూపంలో తీసుకోవడం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ హెచ్చరించారు. ఇదో ప్రమాదకరమైన విధానమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకూ కొవిడ్‌ వ్యాక్సిన్ల కాంబినేషన్‌పై సరైన డేటా అందుబాటులో లేకపోవడంతో ఇది చాలా రిస్క్‌తో కూడుకొన్న విషయమని తెలిపారు. ప్రజలే సొంతంగా ఎక్కడ, ఎప్పుడు, ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఆందోళనకర విధానమన్నారు. వాస్తవానికి ఇప్పటికే పలు దేశాధినేతలు కూడా రెండు వేర్వేరు టీకాలు తీసుకొన్నారు.

ఇటీవలే జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ వేర్వేరు టీకా డోసులను తీసుకొని ఆశ్చర్యపరిచారు. తొలి విడతలో ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ఆమె.. రెండో దఫా మోడెర్నా టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో మెర్కెల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇక ఇటలీ ప్రధాని మారియో డ్రాగి(73) కూడా ఏంజెలా మెర్కెల్‌ బాటలోనే నడిచారు. ఆయన కూడా వేర్వేరు తయారీ సంస్థలకు చెందిన కరోనా టీకాలను వేయించుకున్నారు. మొదటి డోసుగా ఆస్ట్రాజెనెకా తీసుకున్న ఆయన.. రెండో విడతగా ఫైజర్ టీకాను వేయించుకున్నారు. కొన్ని దేశాల్లో ఈ సమ్మేళన విధానాన్ని అమలు చేశారు కూడా. కెనడా, యూకే, కొన్ని ఐరోపా సమాఖ్య దేశాలు వీటిలో ఉన్నాయి. వీరు ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తర్వాత సమస్యలను తప్పించేందుకు ఈ విధానాన్ని పాటించారు. స్పెయిన్‌, దక్షిణ కొరియాల్లో కూడా ఇలాగే వాడారు. ఆస్ట్రాజెనెకా టీకాకు కాంబినేషన్‌లో ఎంఆర్‌ఎన్‌ఏఈ టీకాలను ఇచ్చారు. రష్యా కూడా ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్‌-వి టీకాలను ఈ రకంగా ఇవ్వాలని చూస్తోంది.  మన దేశంలో  ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని ప్రజలకు వైద్యులు నిర్లక్ష్యంతో రెండు డోసుల్లో వేర్వేరు టీకాలను వేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని