పిల్లలకోసం ఆన్‌లైన్‌ గేమ్స్‌ డి-అడిక్షన్‌ సెంటర్లు

తాజా వార్తలు

Published : 25/09/2021 23:30 IST

 పిల్లలకోసం ఆన్‌లైన్‌ గేమ్స్‌ డి-అడిక్షన్‌ సెంటర్లు

తిరువనంతపురం: ఇప్పటి వరకు మద్యం, ధూమపానం.. ఈ రెండింటికే డి-అడిక్షన్‌ సెంటర్లు నిర్వహిస్తారని వింటూ వచ్చాం. కానీ కేరళ ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బానిసవుతున్న చిన్నారులను దృష్టిని పెట్టుకొని డిజిటల్‌ ఆన్‌లైన్‌ గేమ్స్‌ డి-అడిక్షన్‌ సెంటర్లను ప్రారంభించనుంది. తరచూ డిజిటల్‌ గేమ్స్‌ ఆడటం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలెక్కువ. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు ‘‘ డిజిటల్‌ డి-అడిక్షన్‌ సెంటర్లు’’ను కేరళలో ప్రారంభిస్తున్నట్లు శనివారం ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి విజయన్‌ ప్రకటించారు. ఈమేరకు రాష్ర్టంలోని 20 పోలీస్‌ స్టేషన్లను ‘‘చైల్డ్‌-ఫ్రెండ్లి’’గా ప్రకటించారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం  మాట్లాడుతూ.. ‘‘ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడిన పిల్లలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకే ఈ ప్రయత్నం.’’ తెలిపారు.ఆన్‌లైన్‌ గేమింగ్‌ రాష్ట్రంలో అనేకమంది విద్యార్థులకు వ్యసనంగా మారింది.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని