2020లో 225 మంది ఉగ్రవాదులు ఖతం

తాజా వార్తలు

Updated : 01/01/2021 13:28 IST

2020లో 225 మంది ఉగ్రవాదులు ఖతం

జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ చీఫ్‌ వెల్లడి

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ఉగ్రదాడి ఘటనలు, అక్రమ చొరబాట్లు తగ్గాయని ఆ ప్రాంత డీజీపీ దిల్‌బాగ్‌‌ సింగ్‌ తెలిపారు. 2020లో వందకి పైగా జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 225 మంది ముష్కరులను భద్రతాసిబ్బంది మట్టుబెట్టినట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ పోలీసు వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. 

‘ఈ ఏడాది మొత్తంగా భద్రతాసిబ్బంది చేపట్టిన 100కి పైగా ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. కశ్మీర్‌ ప్రాంతంలో 90, జమ్మూలో 13 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టాం. ఇందులో 225 మంది ముష్కరులు(కశ్మీర్‌లో 207, జమ్మూ డివిజన్‌లో 18 మంది) హతమయ్యారు. మృతుల్లో 47 మంది పలు ఉగ్రముఠాలకు చెందిన టాప్‌ కమాండర్లు. ఇప్పటివరకు దాదాపు అన్ని ఉగ్రవాద సంస్థల టాప్‌ కమాండర్లను మట్టుబెట్టాం’ అని దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. 

ఇక ముష్కరులను ఎదుర్కొనే క్రమంలో 44 మంది భద్రతాదళ జవాన్లు, 16 మంది జమ్మూకశ్మీర్‌ పోలిసు సిబ్బంది అమరులైనట్లు డీజీపీ వెల్లడించారు. ఈ ఏడాది ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 38 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 2020లో 299 మంది ముష్కరులు, వారి సహాయకులను అరెస్టు చేయగా.. 12 మంది ఉగ్రవాదులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు చెప్పారు. 

అయితే, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉగ్రవాద నియామకాలు స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించారు. ఇక 2020లో సరిహద్దుల్లో చొరబాట్లు చాలా వరకు తగ్గాయని దిల్‌బాగ్‌ తెలిపారు. సరిహద్దుల్లో భద్రతాబలగాలు అప్రమత్తంగా ఉంటూ ముష్కరుల చొరబాటు యత్నాలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నాయని చెప్పారు. 

ఇదీ చదవండి..

2020లో బరితెగించిన పాక్‌! Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని