సైనికుల త్యాగాల్ని ఎప్పటికీ మరువం: రాజ్‌నాథ్‌

తాజా వార్తలు

Updated : 14/02/2021 11:14 IST

సైనికుల త్యాగాల్ని ఎప్పటికీ మరువం: రాజ్‌నాథ్‌

దిల్లీ: సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో రెండేళ్ల క్రితం ఇదే రోజున సీఆర్పీఎఫ్‌ జవాన్ల వాహనంపై ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో అమరులైన జవాన్లకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం నివాళులు అర్పించారు.

‘2019 పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికులకు నివాళి అర్పిస్తున్నాను. దేశం కోసం వారు చేసిన త్యాగాల్ని భారత్‌ ఎన్నటికీ మరవదు. అమరుల కుటుంబాలకు అండగా కొనసాగుతాం’ అని రాజ్‌నాథ్‌ ట్విటర్‌లో స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సైతం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాహుల్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘అమర జవాన్లకు నివాళి.  వారి కుటుంబాలకు దేశం రుణపడి ఉంటుంది’ అని తెలిపారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ..  ‘మన బంగారు భవిష్యత్తు కోసం పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో మీ త్యాగాలు ఎప్పటికీ మాకు ఆదర్శంగా నిలుస్తాయి’ అని తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 2019, ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై జైషే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 40 మంది జవాన్లు వీర మరణం పొందారు. అనంతరం ఇందుకు ప్రతిగా భారత్‌.. పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిక్షణ స్థావరంపై వైమానిక దాడులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.  

ఇదీ చదవండి

అభిశంసన నుంచి గట్టెక్కిన ట్రంప్‌

97శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని