Delta: టీకాలు వేసుకోని వారిలో వేగంగా వ్యాప్తి

తాజా వార్తలు

Published : 26/06/2021 12:31 IST

Delta: టీకాలు వేసుకోని వారిలో వేగంగా వ్యాప్తి

అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా రకమిదే

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ 

జెనీవా: కరోనాలో పుట్టుకొచ్చిన అనేక రకాల్లో ‘డెల్టా’ వేరియంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న రకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక, టీకాలు వేసుకోనివారే ఎక్కువగా దీని బారిన పడుతున్నారని ఆయన హెచ్చరించారు. 

‘‘డెల్టా వేరియంట్‌పై యావత్ ప్రపంచం కలవరపడుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ కూడా దీనిపై ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు గుర్తించిన అన్ని కరోనా రకాల్లో ఇదే అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న వేరియంట్‌. కనీసం 85 దేశాల్లో డెల్టా కేసులు బయటపడ్డాయి. టీకాలు వేసుకోని వారిలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది’’ అని టెడ్రస్‌ చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల చాలా దేశాలు కరోనా నిబంధనలను సడలిస్తూ వస్తున్నాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరగడం ప్రారంభమైందని తెలిపారు. కరోనా వైరస్‌ మరింత రూపాంతరం చెందే అవకాశముందని హెచ్చరించిన ఆయన.. వైరస్ వ్యాప్తిని నిరోధించడంతోనే కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. 

వ్యాప్తి వేగంలో ఆల్ఫా వేరియంట్‌ తర్వాత డెల్టానే ప్రమాదకర రకమని డబ్ల్యూహెచ్‌ఓ కొవిడ్-19 టెక్నికల్‌ హెడ్‌ డాక్టర్‌ మరియా వాన్‌ పేర్కొన్నారు. టీకాలు వేసుకోనివారికి ఈ వేరియంట్‌ ముప్పు అధికంగా ఉందని ఆమె హెచ్చరించారు. కొన్ని దేశాల్లో టీకా పంపిణీ వేగంగా సాగుతున్నప్పటికీ.. ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందలేదని చెప్పారు. కరోనా వేరియంట్‌ ఏదైనప్పటికీ.. దాని వ్యాప్తిని, తీవ్రతను తగ్గించడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయని తెలిపారు. అయితే కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలంతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని