Corona: ప్రపంచం గడ్డుదశను ఎదుర్కొంటోంది..

తాజా వార్తలు

Published : 03/07/2021 13:56 IST

Corona: ప్రపంచం గడ్డుదశను ఎదుర్కొంటోంది..

ఆందోళన వ్యక్తం చేసిన ఆరోగ్య సంస్థ

జెనీవా: వేగంగా వ్యాప్తి చెందగల కరోనా వేరియంట్లు, వాటి మ్యుటేషన్లతో ఈ ప్రపంచం గడ్డుదశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 100 దేశాలకు విస్తరించిన డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ వేరియంట్‌నుద్దేశించి ఆయన ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అలాగే టీకా కవరేజ్ తక్కువగా ఉన్న దేశాల్లో మళ్లీ ఆసుపత్రులు నిండిపోతున్నాయన్నారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి ప్రతి దేశంలో 70 శాతం మందికి టీకాలు అందించాలని ఇదివరకే టెడ్రోస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

‘వేగంగా వ్యాపించే స్వభావమున్న డెల్టా వంటి వేరియంట్లతో చాలా దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మనం మహమ్మారికి సంబంధించి గడ్డుదశను ఎదుర్కొంటున్నాం. ఇంతవరకు ఏ దేశమూ దీన్నుంచి బయటపడలేదు. డెల్టా వేరియంట్ మార్పులు చేసుకుంటూ, ప్రమాదకరంగా మారుతోంది. అందుకు తగ్గట్టుగా వైద్య సదుపాయాలతో సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని టెడ్రోస్‌ సూచించారు. డెల్టా వేరియంట్‌ను మొదట భారత్‌లో గుర్తించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిది డెల్టా ప్లస్‌గా రూపాంతరం చెంది కలవరపెడుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని