Mumbai rape case: మహిళలకు ముంబయి సురక్షితమైంది.. అనుమానం అవసరం లేదు..!

తాజా వార్తలు

Published : 13/09/2021 23:40 IST

Mumbai rape case: మహిళలకు ముంబయి సురక్షితమైంది.. అనుమానం అవసరం లేదు..!

పార్టీ పత్రికలో అభిప్రాయపడిన శివసేన

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహానగరంలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై శివసేన పార్టీ పత్రిక సామ్నా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటన దేశ ప్రజలందరిని కలవరపర్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ముంబయి సురక్షితమైన నగరమని, దీనిపై ఎవరికి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్యానించింది. మహిళలపై జరుగుతోన్న ఈ తరహా అరాచకాలు రాష్ట్ర సంస్కృతికి మచ్చ తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

‘సాకినాక ప్రాంతంలో జరిగిన అత్యాచారం, హత్య ఘటన ప్రతిఒక్కరిని కలచివేసింది. అయితే, ముంబయి మహా నగరం మాత్రం మహిళలకు సురక్షితమైన ప్రాంతం. దానిపై ఎలాంటి అనుమానం అక్కర్లేదు. భయంకరమైన అసహజ వైఖరి కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ తీరు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది’ అంటూ శివసేన సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న హథ్రాస్ ఘటనతో సాకినాక ఘటనను పోల్చడం సరికాదంది. 

హథ్రాస్‌ ఘటనలో నిందితులకు పాలకుల మద్దతు ఉందని, వారి అరెస్టులో ఆలస్యం జరిగిందని గుర్తుచేసింది. అలాగే సాక్ష్యాలను నాశనం చేసేందుకు బాధితురాలి మృతదేహాన్ని హడావుడిగా దహనం చేశారని వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌లో కథువా అత్యాచార ఘటనలో నిందితుల్ని రక్షించుకునేందుకు వీధుల్లో నిరసన జరిగిందని తెలిపింది. కానీ సాకినాక ఘటనలో నిందితుల్ని 10 నిమిషాల్లో అరెస్టు చేసినట్లు చెప్పింది. 

శుక్రవారం తెల్లవారుజామున సాకినాక శివారు ప్రాంతంలో ఒంటరిగా ఉన్న 34 ఏళ్ల మహిళపై కొందరు దుర్మార్గులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి, బాధితురాలి అవయవాలపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. నడిరోడ్డుపైనే రక్తపు మడుగులో కన్పించిన ఆ మహిళ.. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలోనూ దోషులు ఈ తరహా లైంగిక దాడికే పాల్పడ్డారు. ఆ నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు.. దోషులకు గతేడాది ఉరిశిక్ష కూడా అమలైంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని