Artificial Rain: కృత్రిమ వర్షంతో పులకరించిన దుబాయ్‌

తాజా వార్తలు

Published : 24/07/2021 01:04 IST

Artificial Rain: కృత్రిమ వర్షంతో పులకరించిన దుబాయ్‌

దుబాయ్‌: భారత్​, చైనా వంటి దేశాలు వర్షాలతో విలవిల్లాడుతుంటే.. వర్షాలు లేక దుబాయ్​ అల్లాడుతోంది. ఎండలు మండిపోతుండటంతో ఆ వేడిని తట్టుకునేందుకు అక్కడి ప్రభుత్వం కృత్రిమంగా వర్షాన్ని సృష్టించింది. అంతకంతకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి ఈ వినూత్న ప్రయోగం చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ప్రపంచంలోని పలు దేశాలను వరుణుడు ఎన్నో ఏళ్లుగా కనికరించడంలేదు. ఇందులో దుబాయ్​ ముందువరుసలో ఉంటుంది. ప్రస్తుతం 50 డిగ్రీల ఉష్ణోగ్రతతో దుబాయ్​ వాసులు భానుడి భగభగలు తట్టుకోలేకపోతున్నారు. ఎండలతో విసిగిపోయిన అక్కడి ప్రభుత్వం.. ఓ భారీ ప్రాజెక్టును చేపట్టింది. వరుణుడు కనికరించకపోయినా వర్షాన్ని నేలకు తీసుకొచ్చే పనిలో పడింది. ఇందుకు ‘క్లౌడ్​ సీడింగ్’​ అని పిలిచే వర్షం తయారుచేసే​ టెక్నాలజీని ఉపయోగించింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. దీని తాలూకూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఈ క్లౌడ్ సీడింగ్.. డ్రోన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఆకాశం మేఘావృతమైనపుడు డ్రోన్లను మేఘాల మధ్యకు పంపించి వాటి ద్వారా విద్యుత్​ షాక్​ ఇస్తారు. ఇలా చేయడం ద్వారా అవి కలిసిపోయి వర్షం సృష్టించేందుకు ప్రేరేపిస్తాయి. ఇంగ్లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్​ రీడింగ్​కు చెందిన ప్రొఫెసర్​ మార్టిన్​ అంబామ్​ ఈ టెక్నాలజీని ఉపయోగించే బృందానికి నేతృత్వం వహించారు. దుబాయ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్​ కోసం సుమారు 15 మిలియన్​ డాలర్లును ఖర్చు చేసింది. ఈ భారీ వర్షపాతానికి ముందు పోలీసులు, వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం సమయంలో ఎవరూ బయటకు రావొద్దని, ముఖ్యంగా ప్రయాణాలు చేయకూడదని సూచించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని