close

తాజా వార్తలు

Updated : 15/01/2021 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇండోనేసియాను కుదిపేసిన భూకంపం

ఆసుపత్రి సహా పలు భవనాలు నేలమట్టం

జకార్తా: ఇండోనేసియాను భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం తెల్లవారుజామున సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింది అనేక మంది చిక్కుకుపోయారు.

స్థానిక కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది.  దీంతో కొందరు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి కనీసం 60 భవనాలు కుప్పకూలినట్లు ఇండోనేసియా డిజాస్టర్‌ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడంతో చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

ఆసుపత్రి నేలమట్టం..

భూకంపం తీవ్రతకు పలు నివాస సముదాయాలతో పాటు హోటళ్లు, ఓ ఆసుపత్రి నేలమట్టమయ్యాయి. ఆసుపత్రి కూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు రోగులు, హాస్పిటల్‌ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 

కాగా.. గురువారం కూడా ఇదే ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో పలుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 2018లో ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి..

13 హెలికాప్టర్లతో కొనసాగుతున్న గాలింపు

వాయుసేన తలనొప్పికి తేజస్‌ మందు

 




Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని