ఎన్‌కౌంటర్‌..ఐదుగురు మావోయిస్టుల మృతి!
close

తాజా వార్తలు

Updated : 29/03/2021 11:50 IST

ఎన్‌కౌంటర్‌..ఐదుగురు మావోయిస్టుల మృతి!

ముంబయి: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మీడియా వర్గాల వెల్లడించిన సమాచారం ప్రకారం.. కోబ్రామెండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు, మావోలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఇంకా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితం కూడా కోబ్రామెండా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోలకు మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని