లద్దాఖ్‌లో బలగాలు  మోహరించి ఉన్నాయి..

తాజా వార్తలు

Published : 20/05/2021 19:07 IST

లద్దాఖ్‌లో బలగాలు  మోహరించి ఉన్నాయి..

ఇంటర్నెట్‌డెస్క్‌: లద్దాఖ్‌లో సరిపడా బలగాలు మోహరించి ఉన్నాయని ఆర్మీచీఫ్‌ ఎం.ఎం.నరవాణే తెలిపారు. చైనాతో జరుగుతున్న సైనిక ఉద్రిక్త పరిస్థితి చర్చలతో పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా-భారత్‌ మధ్య చర్చలు  కొనసాగుతన్నాయని  ఆయన వివరించారు. మరో 60వేల మంది వరకు జవాన్లను మోహరించి ఉంచామని వెల్లడించారు. ఇరు దేశాలు దళాలు పరస్పరం ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడకుండా  బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. ‘‘ఇది ప్రతి ఏటా జరిగే శిక్షణ కార్యక్రమమే. ఈ సమయంలో మావారంతా శిక్షణ శిబిరానికి వస్తారు. చైనా దళాలు కూడా వారి శిక్షణ శిబిరాలకు వస్తాయి. కానీ, మేము ఇప్పటికే డిస్‌ ఎంగేజ్‌ అయిన ప్రాంతాలకు వెళ్లం. ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని గౌరవిస్తాయి’’ అని నరవాణే పేర్కొన్నారు. 

కొన్ని నెలల క్రితమే భారత్‌-చైనా దళాలు పాంగాంగ్‌ సరస్సు వద్ద నుంచి వెనుదిరిగాయి. కానీ, గాగ్రా పోస్ట్‌, హాట్‌స్ప్రింగ్స్‌, దెమ్‌చోక్‌ ప్రాంతాల్లో మాత్రం కొనసాగుతున్నాయి. అంతేకాదు అత్యంత వ్యహాత్మకమైన ప్రాంతమైన డెప్సాంగ్‌లో  భారత దళాలు పెట్రోలింగ్‌ నిర్వహించకుండా అడ్డుకొంటున్నాయి. దీంతోపాటు ఈ ప్రాంతాలకి సమీపంలోకి శిబిరాల్లో అత్యధునిక ఆయుధాలను మోహరిస్తున్నాయి. ఎల్‌ఏసీకి వేగంగా బలగాలను తరలించేందుకు అవసరమైన రోడ్లు, ట్రూప్స్‌ షల్టర్లు,హెలీప్యాడ్లు, క్షిపణి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. దీనిపై నరవాణే స్పందిస్తూ.. తామకు చైనాకు ఏమాత్రం తగ్గకుండా మోహరింపులు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.  

 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని