టీకా ఉత్పత్తిలో భారత్‌ది వ్యూహాత్మక పాత్ర: ఈయూ

తాజా వార్తలు

Published : 08/02/2021 14:59 IST

టీకా ఉత్పత్తిలో భారత్‌ది వ్యూహాత్మక పాత్ర: ఈయూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా భారత్‌ వ్యూహాత్మక పాత్రను గుర్తిస్తున్నట్లు ఐరోపా కూటమి ప్రకటించింది. ఐరోపా కూటమి, భారత్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సహా పెట్టుబడులకు సంబంధించి తొలి అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. భారత్‌తో వ్యాక్సిన్‌ సంబంధిత అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈయూ తెలిపింది. సార్వత్రిక సమ దృష్టితోపాటు అందుబాటు ధరలో సురక్షిత టీకానే భారత్‌-ఈయూ ప్రాధాన్య అంశమని ఇరువర్గాలు స్పష్టం చేశాయి. భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఈ చర్చలు వర్చువల్‌గా జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా అంతానికి నిర్దేశించుకున్న కొవాక్స్‌ కార్యక్రమం విజయవంతమవ్వాలంటే ఐరోపా కూటమి మద్దతు తప్పనిసరి అని కేంద్రం పేర్కొంది. అప్పుడే కోట్లాది ప్రాణాలు రక్షించగలమని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. కరోనాను భారత్‌ సమర్థంగా ఎదుర్కొందని, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తిరిగి ‘వి’ ఆకారంలో పుంజుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

బ్యాంకుల ప్రైవేటీకరణకు ఆర్‌బీఐతో పనిచేస్తాం

న్యూయార్క్‌ అసెంబ్లీలో ‘కశ్మీర్‌’ తీర్మానం



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని