ఆ సింగిల్‌ డోస్‌ టీకాకు ఐరోపా సమాఖ్య అనుమతి

తాజా వార్తలు

Published : 12/03/2021 13:12 IST

ఆ సింగిల్‌ డోస్‌ టీకాకు ఐరోపా సమాఖ్య అనుమతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ను నిరోధించేందుకు రూపొందించిన జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ టీకాకు ఐరోపా సమాఖ్య అనుమతిచ్చింది. ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. జాన్సన్‌ అండ్ జాన్సన్‌ సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ టీకా సమర్థవంతమైనదని, భద్రమైనదని, నాణ్యతా ప్రమాణాలకు తగినట్లుగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాతో మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో పురోగతి ఉంటుందని ఈయూ భావిస్తోంది. పౌరుల జీవితాలు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని ఈఎంఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎమోర్‌ కుక్ వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని