Facebook: తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొన్న ఫేస్‌బుక్‌..!

తాజా వార్తలు

Updated : 17/08/2021 16:58 IST

Facebook: తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొన్న ఫేస్‌బుక్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొంది. వారికి సంబంధించిన కంటెంట్‌ను తమ సంస్థల వేదికలపై నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, తాలిబన్లు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌లను పంపే వాట్సాప్‌ను నిరంతరాయంగా వాడుతున్నారు. కంపెనీ నిషేధం విధించినా వారిని అడ్డుకోలేకపోవడం గమనార్హం.

ఫేస్‌బుక్‌ ప్రతినిధి మాట్లాడుతూ అఫ్గాన్‌లో పరిస్థితిని తమ సంస్థ నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. నిషేధిత సంస్థలకు సంబంధించిన ఏదైనా వాట్సాప్‌ ఖాతాపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను తాలిబన్లు యథేచ్ఛగా వాడుతున్నారు. ఇటీవల అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకొన్న విషయాన్ని తాలిబన్‌ ప్రతినిధి ట్విటర్‌ వేదికగానే ప్రకటించారు. దీనిపై ఓ ఆంగ్ల వార్త సంస్థ ట్విటర్‌ను ప్రశ్నించగా.. తాము హింసను ప్రోత్సహించే సంస్థలను, విద్వేషాన్ని రెచ్చగొట్టే సంస్థలను ట్విటర్‌ వినియోగించనీయమని పేర్కొంది. వీటిని ఏ విధంగా గుర్తిస్తారో మాత్రం వెల్లడించలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పౌరహక్కులు హరించడం, మహిళలను అణచివేయడం వంటివి చేస్తారని భయపడుతున్నారు. మరోపక్క తాలిబన్‌ ప్రతినిధులు మాత్రం తాము శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని