రాకేశ్‌ టికాయత్‌ కాన్వాయ్‌పై దాడి

తాజా వార్తలు

Published : 02/04/2021 21:14 IST

రాకేశ్‌ టికాయత్‌ కాన్వాయ్‌పై దాడి

యూపీ: భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్‌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు ఆయన కారు అద్దాలను పగలగొట్టారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లా తతర్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్సోరాలో ఓ సభలో ప్రసంగించి బన్సూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ దాడి జరిగింది. తన కారు ధ్వంసమైన వీడియోను టికాయత్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  భాజపాకు చెందిన వారే తన వాహనంపై దాడి చేసినట్టు ఆయన ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో నాలుగు మాసాలకు పైగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో రాకేశ్‌ టికాయత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సాగు చట్టాలు రద్దుచేసే దాకా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టంచేస్తున్నారు. ఇందులో భాగంగా పలు సభల్లో పాల్గొంటున్నారు. కొత్త సాగు చట్టాలతో కేవలం రైతులకే కాకుండా అన్ని వర్గాలపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని టికాయత్‌ పేర్కొంటున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని