ఈ నెలాఖరుకు భారత్‌కు 36వేల టన్నుల ఉల్లి!

తాజా వార్తలు

Published : 08/01/2020 01:45 IST

ఈ నెలాఖరుకు భారత్‌కు 36వేల టన్నుల ఉల్లి!

దిల్లీ: దేశంలో నెలకొన్న ఉల్లి కొరతను అధిగమించేందుకు ఇప్పటివరకు విదేశాల నుంచి 12,000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ వెల్లడించారు. ఈ మొత్తాన్ని కేవలం కిలో రూ.49 - రూ.51లకే రాష్ట్రాలకు అందిస్తున్నామని చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టర్కీ, అఫ్గనిస్థాన్‌ తదితర దేశాల నుంచి 12000 టన్నుల ఉల్లి దిగుమతి చేసుకున్నామన్నారు.

ఇప్పటికే 1000 టన్నుల ఉల్లిని దిల్లీ, అంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు పంపిణీ చేశామని పాసవాన్‌ అన్నారు. అంతేకాకుండా ఈ నెల చివరికల్లా మరో 36,000 టన్నుల ఉల్లి దేశానికి వచ్చే అవకాశముందని చెప్పారు. అంతా సజావుగా జరిగితే ఉల్లి రేటు మరింత తగ్గే అవకాశముందన్నారు. గత రెండు నెలలుగా దేశంలో చాలా చోట్ల కేజీ ఉల్లి ధర రూ.100లకు పైగా పలుకుతున్న విషయం తెలిసిందే.  గత నెలలో దిల్లీలో కేజీ ఉల్లి ధర రూ.118 ఉంటే ప్రస్తుతం రూ.70లు పలుకుతోంది. ఖరీఫ్‌లో ఉల్లి ఉత్పత్తి 25 శాతం పడిపోవడంతో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని