శాంతి మార్గమే సమస్యలకు పరిష్కారం: మోదీ

తాజా వార్తలు

Published : 27/01/2020 02:06 IST

శాంతి మార్గమే సమస్యలకు పరిష్కారం: మోదీ

దిల్లీ: హింసాత్మక పద్ధతుల్లో నిరసనలు చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాదిలో తొలి మన్‌కీబాత్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన రేడియో ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హింసాత్మక పద్ధతుల్లో ఆయుధాలతో నిరసన తెలపడం సమస్యలకు పరిష్కార మార్గం కాదన్నారు. అలా సమస్యల పరిష్కారానికి పోరాడేవారు.. ఆయుధాలు వీడి సరైన మార్గంలోకి రావాలని కోరారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు క్రమంగా తగ్గుతున్నాయని, దానికి కేవలం శాంతియుత చర్చలే కారణమన్నారు. 
‘‘ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభించిన జల్‌శక్తిలో భాగంగా పెద్ద సంఖ్యలో చెరువులు, సరస్సులు వేగంగా నిర్మితమయ్యాయి. అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు హృదయపూర్వకంగా ఈ ప్రచారంలో పాల్గొనడం ఎంతో మంచి విషయం. ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్య ఏటా పెరుగుతుండటం సంతోషాన్నిస్తోంది. జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించడం ఒక మంచి పరిణామం. అలా చేయడం వల్ల క్రీడాకారులకు విభిన్న సంస్కృతులు తెలియడంతో పాటు క్రీడల్లో తమ సత్తా చాటుకోగలుగుతారు. ఏటా ఇలానే ‘ఖేలో ఇండియా’ నిర్వహిస్తాం’’ అని తెలిపారు. అసోంలో 8 మిలిటెంట్‌ గ్రూపులకు చెందిన 644 మంది మిలిటెంట్లు లొంగిపోవడం గొప్ప విజయమన్నారు. దేశ అభివృద్ధి కోసం వారు శాంతి మార్గంపై విశ్వాసం ఉంచారని మోదీ అన్నారు.

‘గగన్‌యాన్‌ మిషన్‌’ విషయంలో భారత్‌ మరో ముందడుగు వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికే దానికోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినట్లు తెలిపారు. వారంతా భారత వైమానిక దళానికి చెందిన పైలట్లే కావడం విశేషం. ఈ సందర్భంగా గగన్‌యాన్‌ మిషన్‌లో మనతో కలిసి పనిచేస్తున్న రష్యన్‌ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, నలుగురు పైలట్లకు అభినందనలు తెలియజేశారు. తాము ఏదైనా చేయగలమనే విశ్వాసం భారతీయుల్లో పెరుగుతోందని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని