అంతర్గత విషయాల్లో జోక్యం తగదు: వెంకయ్య

తాజా వార్తలు

Published : 28/01/2020 01:33 IST

అంతర్గత విషయాల్లో జోక్యం తగదు: వెంకయ్య

దిల్లీ: భారత అంతర్గత విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యానికి అవకాశం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై యూరోపియన్‌ పార్లమెంట్‌ చర్చ, ఓటింగ్‌ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక్కడ నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో సోమవారం ఆయన పాల్గొన్నారు. భారత పార్లమెంట్‌, ప్రభుత్వ పరిధిలోని అంశాలపై విదేశాలు జోక్యం చేసుకుంటున్న ఘటనలు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటి ప్రయత్నాలు తగవని, భవిష్యత్‌లో ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు.

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై యూరోపియన్‌ పార్లమెంట్‌లో సభ్యులు ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టారు. దీనిపై బుధవారం చర్చించనున్నారు. తర్వాతి రోజు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. దీన్ని  భారత్‌ ఖండించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యుల చేత ఆమోదం పొందిన ఓ చట్టాన్ని ప్రశ్నించడం సరైన చర్య కాదని స్పష్టం చేసింది. ఈ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని