‘కరోనా’కు మందు ఉంది.. కానీ..!

తాజా వార్తలు

Updated : 29/01/2020 19:39 IST

‘కరోనా’కు మందు ఉంది.. కానీ..!

బీజింగ్‌: చైనాలో ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టినట్లేనా అంటే.. అవునని అంటున్నారు హాంగ్‌కాంగ్‌కు చెందిన పరిశోధకులు. ఇప్పటికే మందు అయితే తయారుచేశారని.. కానీ దాన్ని ఇంకా పలు విధాలుగా పరీక్షించాల్సి ఉందని అంటున్నారు. ఈ మేరకు చైనాలోని ప్రముఖ వైద్య నిపుణులు యువెన్‌ క్వాక్‌ యుంగ్‌ వెల్లడించారు. ‘మేము ఇప్పటికే కరోనా వైరస్‌ విరుగుడుకు మందును తయారుచేశాం. కానీ దాన్ని ముందు జంతువులపై పరీక్షించి ప్రయోగం నిర్వహించాలి. జంతువులపై ప్రయోగించేందుకు దాదాపు కొన్ని నెలల సమయం పడుతుంది. అంటే అది మనుషులపై క్లినికల్‌గా ప్రయోగించడానికి ఇంకా సంవత్సరం సమయం పట్టే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 132కు చేరింది. మరో 6వేల మందికి ఈ వ్యాధి సోకినట్లు అధికారులు చెబుతున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని