వాటితో కరోనాకు అడ్డుకట్ట: థాయ్‌ వైద్యులు

తాజా వార్తలు

Updated : 03/02/2020 16:25 IST

వాటితో కరోనాకు అడ్డుకట్ట: థాయ్‌ వైద్యులు

బ్యాంకాక్‌: కరోనా వైరస్‌ కారణంగా చైనా పేరెత్తితేనే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి ఆ దేశంలో 305 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 24 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నివారణకు మందు కనుగొనేందుకు చైనా తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా కరోనా వైరస్‌ సోకిన చైనా మహిళకు ఫ్లూ, హెచ్‌ఐవీకి నయం చేయడానికి ఉపయోగించే మందులు కలిపి వాడటం వల్ల వ్యాధి తీవ్రత తగ్గినట్లు థాయ్‌లాండ్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రెండు రోజుల క్రితం కరోనా వైరస్‌ సోకిన 71 ఏళ్ల మహిళ థాయ్‌లాండ్‌లోని ఒక ఆస్పత్రిలో చేరింది. సదరు మహిళకు ఆస్పత్రి వైద్యులు ఫ్లూ, హెచ్‌ఐవీ చికిత్సకు ఉపయోగించే యాంటీ వైరల్ ఏజెంట్లు ఉన్న కాక్టెయిల్ ఇచ్చారు. 48 గంటల తర్వాత సదరు మహిళకు పరీక్షలు నిర్వహించగా ఆమె పరిస్థితి మెరుగుపడినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో కరోనా వైరస్‌ను తగ్గించేందుకు ఈ మందు విరుగుడుగా పనిచేస్తోందని థాయ్‌లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఈ మేరకు థాయ్‌లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్‌ క్రింగ్సాక్‌ అట్టిపోర్వానిచ్‌ మాట్లాడుతూ ‘‘మేం రోగికి యాంటీ ఫ్లూ డ్రగ్ ఒసెల్టామివిర్‌, లోపినావిర్, రోటైనావిర్‌ కలిపి పెద్ద మొత్తంలో ఇచ్చాం. 48 గంటల తర్వాత సదరు రోగి పరిస్థితిలో మెరుగుదల కనిపించింది. మరో 12 గంటల్లో ఆమె లేచి నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం’’ అని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటివరకూ థాయ్‌లాండ్‌లో 19 మంది కరోనా వ్యాధితో ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. వారిలో 8 మంది కోలుకొని ఇంటికి వెళ్లగా, 11 మంది ఇప్పటికీ ఆస్పత్రిలోనే  ఉన్నారు.

ఇవీ చదవండి: ఒక్కరోజే 57 ‘కరోనా’ మరణాలు

                    భారత్‌లో మూడో వ్యక్తికి కరోనా

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని