ప్రమాదంలో మూడు ముక్కలైన విమానం!

తాజా వార్తలు

Published : 06/02/2020 00:35 IST

ప్రమాదంలో మూడు ముక్కలైన విమానం!

అంకారా: టర్కీలోని ఇస్తాంబుల్‌లో బుధవారం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం ల్యాండ్‌ అయ్యే క్రమంలో రన్‌వే నుంచి అదుపుతప్పి రోడ్డుపైకి దూసుకువెళ్లింది. అక్కడి మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్తాంబుల్‌ సబీహ విమానాశ్రయంలో పెగాగస్‌ ఎయిర్‌లైన్‌ సంస్థకు చెందిన విమానం ల్యాండ్‌ అయ్యే క్రమంలో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అది రోడ్డు పైకి దూసుకువెళ్లింది. ఈ క్రమంలో విమానం మూడు ముక్కలుగా విరిగిపోవడం గమనార్హం. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 177 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ ఎవరి ప్రాణానికి ప్రమాదం జరగలేదు. కొందరు మాత్రం స్వల్పగాయాల పాలైనట్లు అక్కడి రవాణా మంత్రి మెహ్మెత్‌ చెప్పారు. విరిగిపోయిన విమాన భాగాల నుంచి ప్రయాణికులు బయటకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆ విమానాశ్రయానికి విమానాల రాకను నిలిపివేసినట్లు మంత్రి తెలిపారు.

 

 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని