థాయిలాండ్‌లో కాల్పులు: 17మంది మృతి

తాజా వార్తలు

Published : 09/02/2020 01:02 IST

థాయిలాండ్‌లో కాల్పులు: 17మంది మృతి

బ్యాంకాక్‌: థాయిలాండ్‌లో ఓ సైనికుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ఖోరత్‌ ప్రాంతంలో తుపాకీ చేత పట్టుకొని ద్విచక్రవాహనంపై తిరుగుతూ కాల్పులకు తెగబడ్డాడు. కనిపించిన వారందరిపై ఇష్టానుసారంగా కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ షాపింగ్‌ మాల్‌ ఎదుట తిరుగుతూ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం షాపింగ్‌మాల్‌లోకి చొరబడి అక్కడి ప్రజలను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని