‘కరోనా’ పేరు మారింది!

తాజా వార్తలు

Published : 12/02/2020 00:45 IST

‘కరోనా’ పేరు మారింది!

కొత్త పేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: చైనాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విజృంభిస్తూ.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధికారికంగా పేరును పెట్టింది. కరోనాకు కోవిడ్‌-2019(covid-2019)ను పేరుగా నిర్ణయించినట్లు వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అదానోమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనాకు మేము కోవిడ్-19గా పేరును నిర్ణయించాం. కోవిడ్‌ పూర్తి పేరు c- corona, v- virus, d- disease2019. కరోనా అనే పేరు దానికి చెందిన కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుంది. దీంతో ఈ పేరుపై గందరగోళాన్ని తొలగించేందుకు పరిశోధకులు ఈ అధికారిక పేరును పెట్టారు. ప్రజల్లో గందరగోళం కలిగించకుండా ఒకపేరు ఉండటం ముఖ్యం. అందుకే కొత్త పేరు నిర్ణయించాం. మేము కనుగొన్న పేరు ఒక భూభాగాన్ని గానీ, ఒక జంతువును గానీ, ఒక స్వతంత్ర జాతిని గానీ సూచించదు. ఈ పేరు ఆ వ్యాధిని తెలియజేస్తుంది’’ అని టెడ్రస్‌ వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా చైనాలో ఇప్పటివరకు సుమారు 1000 మంది మరణించినట్లు అక్కడి అధికారవర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని