దేశంలో శాంతికి నా వంతు పాత్ర పోషిస్తా: రజినీ

తాజా వార్తలు

Updated : 02/03/2020 12:27 IST

దేశంలో శాంతికి నా వంతు పాత్ర పోషిస్తా: రజినీ

చెన్నై: దేశంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు తన వంతు పాత్ర పోషించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అన్నారు. దిల్లీలో ఇటీవల జరిగిన ఘర్షణలను ఖండించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతకుముందు రజనీకాంత్‌తో పలువురు ముస్లిం మత పెద్దలు  ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం ట్విటర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో శాంతిని పెంపొందించేదుకు నా వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. 

ఈశాన్య దిల్లీ ఘటనలపై గతవారం రజినీకాంత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘర్షణల్ని అదుపు చేయడంలో కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. హింస ఆపలేని వారు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని