అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు 

తాజా వార్తలు

Updated : 04/03/2020 20:11 IST

అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు 

దిల్లీ: భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. గతంలో మాదిరిగా కేవలం పన్నెండు దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులను మాత్రమే కాకుండా ... అందరు అంతర్జాతీయ విమాన ప్రయాణికులు, విమానాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 

ఓ మీడియా సమావేశంలో మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ... ఇరాన్‌ ప్రభుత్వం సహకరిస్తే ఆ దేశంలో కూడా కరోనా వైద్య పరీక్షల సదుపాయాన్ని నెలకొల్పుతామని అన్నారు. ఇరాన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి ముందు వారిని సునిశితంగా పరీక్షించేందుకు ఈ చర్య ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు. దేశ రాజధానిలోని ఆస్పత్రులలో ఐసోలేషన్‌ వార్డ్‌లను నెలకొల్పే విషయమై దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి, సంబంధిత అధికారులతో చర్చలు జరిపామని హర్షవర్ధన్‌ చెప్పారు. భారత్‌లో 28 మందికి కొవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయిందని మంత్రి చెప్పారు. 

 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని