ఐస్‌క్రీం రుచి చూసినందుకు నెల రోజుల జైలు!

తాజా వార్తలు

Published : 08/03/2020 01:04 IST

ఐస్‌క్రీం రుచి చూసినందుకు నెల రోజుల జైలు!

టెక్సాస్‌: ఓ షాపింగ్‌మాల్‌కి వెళ్లిన యువకుడు ఫ్రిజ్‌లో ఉన్న ఐస్‌క్ర్రీంని రుచిచూశాడు. ఇంకేముంది, ఈ వీడియో కాస్త సామాజిక మాథ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ యువకుడిపై కేసు నమోదు చేయగా...తాజాగా కోర్టు నెల రోజుల శిక్ష విధించింది. 

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన అండెర్సన్‌ అనే 24ఏళ్ల యువకుడు గత సంవత్సరం ఆగస్టులో స్థానికంగా ఉన్న వాల్‌మార్ట్‌ మార్కెట్‌కు వెళ్లాడు. ఆసమయంలో అక్కడున్న ఫ్రీజర్‌లో నుంచి ఐస్‌క్రీంను బయటికి తీసి రుచిచూశాడు. అనంతరం దాన్ని తిరిగి అక్కడే పెట్టాడు. అంతటితో ఆగకుండా ఈ ఘటన మొత్తాన్ని సెల్ఫీతో రికార్డు చేసుకున్నాడు. కొన్నిరోజులకు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో లక్షా యాభైవేల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. ఈవిషయం వాల్‌మార్ట్‌ సిబ్బందికి తెలియడంతో ఆ ఫ్రీజర్‌లో ఉన్న ఐస్‌క్రీంలను తొలగించారు. దీంతో దాదాపు 1565 డాలర్లు నష్టపోయినట్లు సదరు సూపర్‌మార్కెట్‌ పేర్కొంది.

ఇదిలా ఉంటే, దీన్ని సామాజిక మాధ్యమాల్లో కొందరు సరదాగా తీసుకున్నప్పటికీ ఇది ప్రజల ఆరోగ్యభద్రతపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. విచారించిన న్యాయస్థానం అతనికి నెలరోజుల జైలుశిక్షతోపాటు వెయ్యి డాలర్లను చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే, ఆ యువకుడు మాత్రం తాను ఎంగిలిచేసిన ఐస్‌క్రీంను కొనుగోలు చేసినట్లు అధికారుల ముందు వాదించాడు. దీన్ని సరదాగా చేసినట్లు పేర్కొన్నాడు. ఇదేవిషయం సీసీకెమెరాల్లో కూడా స్పష్టమయ్యింది. అయినప్పటికీ, యువకుడి ప్రవర్తన కారణంగా కోర్టు అతడికి శిక్ష విధించింది. అంతేకాకుండా వాల్‌మార్ట్‌ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు ప్రకటించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని