కూలిన క్వారంటైన్‌ భవనం..ఆరుగురి మృతి

తాజా వార్తలు

Updated : 08/03/2020 16:46 IST

కూలిన క్వారంటైన్‌ భవనం..ఆరుగురి మృతి

బీజింగ్‌: చైనాలో కరోనా అనుమానితుల్ని వైద్య పర్యవేక్షణలో ఉంచిన క్వారంటైన్‌ భవనం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 28 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ భవనంలో 70 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. క్వాన్‌జౌ నగరంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అక్కడి సిబ్బంది మొత్తం 43 మందిని కాపాడారు. వారిలో 36 మందిని ఆస్పత్రికి తరలించామని అక్కడి ప్రభుత్వం తెలిపింది. సహాయక చర్యల్లో సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. పోలీసు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. బాధితులు కరోనా అనుమానితులు కావడంతో ప్రతి ఒక్కరూ టోపీలు, మాస్కులు, కళ్లజోడు ధరించి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాద సమయంలో క్వారంటైన్‌ భవనంలో 58 మంది అనుమానితులు ఉన్నారు. చైనాలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి..

ట్రంప్‌ హాజరైన సమావేశంలో వ్యక్తికి కరోనా!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని