కరోనాను సమన్వయంతో తిప్పికొడదాం: కేంద్రం

తాజా వార్తలు

Published : 09/03/2020 16:25 IST

కరోనాను సమన్వయంతో తిప్పికొడదాం: కేంద్రం

కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ సమీక్ష

దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కేసులు దేశంలో 43 నమోదవ్వడంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఈ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉన్నామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలతో పాటు ఎప్పటికప్పుడు ఆయా భాషల్లో తగిన సూచనలు ఇస్తున్నామని చెప్పారు. సోమవారం హర్షవర్దన్‌ అధ్యక్షతన దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, దిల్లీ పురపాలక మేయర్లు, పలు శాఖల సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం  జరిగింది.  అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ  ప్రాణాంతక మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ల్యాబోరేటరీలను బలోపేతం చేసుకొని మానవ వనరులను సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలను కోరినట్టు చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, కమ్యూనిటీ సర్వైలెన్స్‌, ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌, ఐసోలేషన్‌ వార్డుల గుర్తింపు, అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడం, మాస్కులు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలపై దృష్టిపెట్టాలన్నారు. 

కరోనా వైరస్‌ను కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో ఎదుర్కొంటాయని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. సోమవారం సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాణాంతక మహమ్మారిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నట్టు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని