రాజ్యసభ సభ్యునిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రమాణం

తాజా వార్తలు

Updated : 19/03/2020 15:54 IST

రాజ్యసభ సభ్యునిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రమాణం

దిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో తన సభ్యత్వం గురించి సమర్థించుకున్నారు. తన హాజరుతో న్యాయవ్యవస్థకు సంబంధించిన విషయాలను పార్లమెంటులో చర్చించే అవకాశం వచ్చినట్లు భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోగా.. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి పలు విమర్శలు వెళ్లువెత్తాయి. ప్రమాణస్వీకార సమయంలోనూ రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుల నుంచి ఆయన నిరసనలు ఎదురయ్యాయి. ఆయన ప్రమాణస్వీకారాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని