కరోనా ఎఫెక్ట్‌: షాహీన్‌బాగ్‌ ఖాళీ

తాజా వార్తలు

Updated : 24/03/2020 15:20 IST

కరోనా ఎఫెక్ట్‌: షాహీన్‌బాగ్‌ ఖాళీ

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఎట్టకేలకు పోలీసులు మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి తొలగించారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను వ్యతిరేకించిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. దిల్లీలోనూ కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నిరసనకారుల్ని కోరినప్పటికీ.. గత కొన్ని రోజులుగా నిరాకరిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు వైరస్‌ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుండడంతో వారిని అక్కడి నుంచి పంపించేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగానూ దాదాపు నిరసనకారులంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. కేవలం అయిదుగురు మహిళలు మాత్రం అక్కడే ఉండి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు మూడు నెలల తర్వాత షాహీన్‌ బాగ్‌ నిరసనలకు లాక్‌డౌన్‌ కారణంగా బ్రేక్‌ పడింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని