స్పైస్‌జెట్ పైలట్‌కు కరోనా పాజిటివ్ 

తాజా వార్తలు

Published : 29/03/2020 18:40 IST

స్పైస్‌జెట్ పైలట్‌కు కరోనా పాజిటివ్ 

దిల్లీ: భారత్‌లో రోజురోజుకి కరోనా వ్యాప్తి విస్తృతమవుతోంది. తాజాగా స్పైస్‌జెట్ విమాయాన సంస్థలో పనిచేసే పైలట్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆయన మార్చి నెలలో ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదని పేర్కొంది. చివరగా సదరు పైలట్ మార్చి 21న చెన్నై నుంచి దిల్లీకి విమానాన్ని నడిపినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన తన ఇంట్లో స్వీయనిర్భందంలో ఉన్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది. ఆయనకు అవసరమైన వైద్య సదుపాయాలను అందిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనతో సన్నిహితంగా ఉన్న సిబ్బందిని పద్నాలుగు రోజులపాటు స్వీయనిర్భందంలో ఉండాలని సూచించినట్లు సంస్థ వెల్లడించింది. ‘‘ప్రయాణికులు, సిబ్బంది భద్రత మాకు ఎంతో ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నాం. డబ్ల్యూహెచ్‌వో నిబంధనలను అనుసరించి జనవరి నెల చివరి నుంచే మా విమానాలన్నింటినిలో అంటురోగాలను నివారించేందుకు తగు జాగ్రత్తలను పాటిస్తున్నాం’’ అని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. 

ఇప్పటి వరకు భారత్‌లో  కరోనా సోకిన వారి సంఖ్య 979కి చేరింది. వీరిలో 25 మంది మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా 86 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. తాజాగా ఈ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని